- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు భారత్‌కు షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్‌కు రిషబ్ పంత్ దూరమయ్యాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ సమయంలో అస్వస్థతకు గురైన పంత్‌ను వైద్యుల సూచనలతో జట్టుకు దూరంగా ఉంచారు. అతడి స్థానంలో యువ వికెట్‌కీపర్ ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ ప్రదర్శన ఆకట్టుకోవడంతో సెలక్టర్లు అతడికి అవకాశం ఇచ్చారు. వడోదర వేదికగా నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే జరగనుంది.
- Advertisement -



