Tuesday, February 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుధురంధర్-2 ది రివెంజ్ టీజర్ విడుదల‌

ధురంధర్-2 ది రివెంజ్ టీజర్ విడుదల‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ‘ధురంధర్’ మొదటి భాగం సృష్టించిన రికార్డుల తర్వాత, దాని సీక్వెల్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ టీజర్ విడుదలైంది. ఒక నిమిషం 12 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్‌లో, రణ్‌వీర్ పోషిస్తున్న హమ్జా అలీ మజారీ పాత్ర యవ్వనంలోని జీవితాన్ని చూపించారు. పాకిస్థాన్‌లోని ల్యారీ టౌన్‌ను శాసించే ఓ క్రూరమైన గ్యాంగ్‌లో అతను ఎలా ఎదిగాడో, స్పైగా మారకముందు అతని నేపథ్యం ఏమిటో ఈ టీజర్ తెలియజేస్తోంది.

ఆదిత్య ధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. మొదటి భాగంలో చనిపోయిన అక్షయ్ ఖన్నా పాత్ర ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో కనిపించనుంది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,320 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ‘ధురంధర్ 2’ చిత్రాన్ని మార్చి 19న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -