- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా విడుదలైన ధురంధర్ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. ఇప్పటికే ₹1000 కోట్ల క్లబ్‌లో చేరిన ధురంధర్, పుష్ప 2 హిందీ వసూళ్ల రికార్డును దాటేసింది. ట్రిపుల్ ఆర్ ₹1230 కోట్ల రికార్డును లక్ష్యంగా చేసుకొని ₹1200 కోట్లకు పైగా వసూలు చేసింది. ధురంధర్ ఈ రికార్డును అధిగమిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతో బాలీవుడ్ ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విజయాన్ని ధురంధర్ అందించింది.ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నెల రోజులకు పైగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తోంది.
- Advertisement -



