Friday, May 2, 2025
Homeతాజా వార్తలుపేదలకు అందుబాటులో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌

పేదలకు అందుబాటులో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌

– ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌
– సంతోష్‌ నగర్‌లో డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ప్రారంభం
నవతెలంగాణ-చంపాపేట్‌

పేదలకు అందుబాటులో ఉండే విధంగా జనరిక్‌ మెడిసిన్‌తోపాటు ఐడీఎల్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్‌.వినయకుమార్‌ అన్నారు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆఫీసు దగ్గర జనరిక్‌ మెడిసిన్‌తో పాటు ఐడీఎల్‌ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను గురువారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ అబ్బాస్‌, డాక్టర్‌ శారదతో కలిసి ఆయన రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్‌.వినయకుమార్‌ మాట్లాడుతూ.. ఇది పూర్తిగా పేదలకు అందే విధంగా ఉండాలన్నారు. ఇప్పటికే వైద్యం పేదలకు దూరంగా ఉన్న తరుణంలో ఈ ప్రాంతంలో జనరిక్‌ మెడిసిన్‌తో పాటు డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ప్రజలు దీన్ని ఉపయోగించుకునే విధంగా మనం ప్రచారం చేయాలన్నారు. పేదల బస్తీల్లో ప్రచారం చేస్తూ వాళ్లకు ఉపయోగపడే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.ధర్మానాయక్‌, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.శోభన్‌నాయక్‌, ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.రఘు, సీఐటీయూ కార్యదర్శి ఎండీ మీనా, కిషన్‌, కృష్ణ, ఆర్‌.శేఖర్‌, మహేష్‌ దుర్గే, ఐడీఎల్‌ డయాగస్టిక్‌ సెంటర్‌ నిర్వాహకులు ఎం.ఇందు, జనరిక్‌ మెడిసిన్‌ నిర్వాహకులు ఎం.బిందు, లక్ష్మణ్‌, గిరిజన సమైక్య జిల్లా కార్యదర్శి జె.శివా నాయక్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img