Tuesday, September 23, 2025
E-PAPER
Homeవరంగల్ఓసీపీని సందర్శించిన డైరెక్టర్ కోల్ నాగ్య

ఓసీపీని సందర్శించిన డైరెక్టర్ కోల్ నాగ్య

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచర్ల ఓసీపీని సొమవారం డైరెక్టర్ కోల్ బీ నాగ్య (ఐఆర్టీఎస్) సందర్శించారు.ఈ సందర్భంగా గత ఏడాది ఓసీపీలో చేపట్టిన బొగ్గు ఉత్పత్తి, ఈ ఏడాది ఇప్పటి వరకు తీసిన బొగ్గు ఉత్పత్తి, నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంపై చర్చించారు. అలాగే డేంజర్ జోన్ను పరిశీలించి, కన్వేయర్ బెల్టు పనుల పురోగతి పై చర్చించారు.ఓసీపీకి సేఫ్టీ, రక్షణ, స్టార్ రేటింగ్ అవార్డులు రావడం పట్ల సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏఎమ్మార్ సీఈవో డీఎల్ఆర్ ప్రసాద్, కే టీపీపీ సీఈ శ్రీప్రకాష్, ఎస్ఈలు రామకృష్ణ, ముత్యాలరావు, జెన్ కో జీఎం మోహన్రావు, ఏఎమ్మార్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్ఎన్. మూర్తి, మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టి ఆఫీసర్ సురేష్బాబు, డీజీఎం సర్వే సర్వోత్తమ్, డీజీఎం మెకానికల్ కిషన్ పాల్గోన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -