Wednesday, January 14, 2026
E-PAPER
Homeతాజా వార్తలుట్రేడింగ్ పేరుతో దర్శకుడు తేజ కొడుక్కి రూ. 63 లక్షల టోకరా

ట్రేడింగ్ పేరుతో దర్శకుడు తేజ కొడుక్కి రూ. 63 లక్షల టోకరా

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు, వ్యాపారవేత్త అమితవ్ తేజ దారుణంగా మోసపోయారు. ట్రేడింగ్ ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ జంట ఆయన నుంచి రూ. 63 లక్షలు కాజేసింది. మోసపోయానని గ్రహించిన అమితవ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్న అమితవ్ తేజకు 2025 ఏప్రిల్‌లో మోతీనగర్‌కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. తాము ట్రేడింగ్ నిపుణులమని, పెట్టుబడి పెడితే అనూహ్య లాభాలు వస్తాయని వారు నమ్మబలికారు. ఒకవేళ నష్టాలు వస్తే, తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను రాసిస్తామని హామీ ఇచ్చారు.

వారి మాటలను నిజమని నమ్మిన అమితవ్ పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. ఈ  క్రమంలో వారంలోనే రూ. 9 లక్షల లాభం వచ్చిందంటూ అమితవ్‌కు కొన్ని నకిలీ పత్రాలను చూపించారు. ఇది నిజమని నమ్మిన అమితవ్ విడతల వారీగా మొత్తం రూ. 63 లక్షలను ఆ దంపతులకు అందజేశారు. అయితే, నెలలు గడుస్తున్నా అటు లాభాలు కానీ, ఇటు అసలు కానీ తిరిగి రాకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. వారిని నిలదీయగా ముఖం చాటేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -