నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కలిసేందుకు ఆర్. కృష్ణయ్యతో కలిసి బీసీ సంఘాల నేతలు వచ్చారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల తగువు పెరిగి, తోపులాట స్థాయికి చేరింది. ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టేందుకు రామచంద్రరావు సమక్షంలో సమావేశమైన బీసీ సంఘం నేతలు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ మధ్య విభేదాలు ఉధృతమయ్యాయి.
ఈ ఘర్షణ రామచంద్రరావు, ఆర్. కృష్ణయ్య సమక్షంలోనే జరగడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 18న జరగబోయే బీసీ బంద్‌కు మద్దతు ఇవ్వడం ప్రధాన ఉద్దేశ్యంగా దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.