నవతెలంగాణ – హైదరాబాద్ : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ, తదుపరి ఓటింగ్ మార్చి 9న జరుగుతుందని, విరామం తర్వాత సభ తిరిగి సమావేశమ వుతుందని కేంద్రపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆదివారం తెలిపారు. షెడ్యూల్ ప్రకారం.. బడ్జెట్ సెషన్ రెండవ దశ మార్చి 9 నుండి ఏప్రిల్ 2 వరకు కొనసాగుతుందని అన్నారు. పలు ముఖ్యమైన చట్టాలు, క్లిష్టమైన బిల్లులపై పార్లమెంటులో చర్చ, ఆమోదం కోసం సమర్పించనున్నట్లు తెలిపారు. మార్చి 9న లోక్‌సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉంటుందని, పార్లమెంట్ నిబంధనల ప్రకారం తీర్మానంపై మొదటి రోజే చర్చ చేపట్టాలని అన్నారు. చర్చతోపాటు ఓటింగ్ నిర్వహిస్తామని అన్నారు. ప్రతిపక్షం సభ పనిచేసేందుకు అనుమతించకపోతే గిలెటిన్‌ను ప్రవేశపెడతామని, దాంతో వారికే నష్టమని అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చ సమయంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీని మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
మార్చి 9న స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ, ఓటింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



