Wednesday, October 15, 2025
E-PAPER
Homeజాతీయంక‌రూర్ తొక్కిస‌లాటపై త‌మిళ‌నాడు అసెంబ్లీలో చ‌ర్చ‌

క‌రూర్ తొక్కిస‌లాటపై త‌మిళ‌నాడు అసెంబ్లీలో చ‌ర్చ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడమే తొక్కిసలాటకు ప్రధాన కారణమని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు. విజయ్ ర్యాలీకి మధ్యాహ్నం వస్తారని పార్టీ ప్రకటించిందని, దీంతో ఎక్కువ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారని, కానీ ఆయన రాత్రి ఏడు గంటలకు వచ్చారని స్టాలిన్ గుర్తు చేశారు.విజయ్ కరూర్ తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, ప్రచార వాహనం జనంలోకి వెళుతుండగా గందరగోళం నెలకొందని, ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. దాడులకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చెప్పారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని స్టాలిన్ గుర్తు చేశారు. అసలు, విజయ్ ప్రచార ర్యాలీకి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రతిపక్షాలు సభలో నిలదీశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -