నవతెలంగాణ-హైదరాబాద్ : లోక్‌సభలో ఇవాళ ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ జరగనుంది. అయితే, ఇందుకోసం కేంద్రం 16 గంటల సమాయాన్ని కేటాయిస్తున్నట్లుగా వెల్లడించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చర్చను ప్రారంభించనున్నారు. ఇవాళ సభకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. లోక్‌సభలో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చ సందర్భంగా అన్ని పార్టీలు తాజాగా విప్ జారీ చేశాయి. నేడు, రేపు, ఎల్లుండి సభ్యులంతా విధిగా సభకు హాజరు కావాలని పేర్కొన్నారు. బీజేపీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ జైశంకర్, అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దూబే, మాట్లాడనున్నారు. అదేవిధంగా మరోవైపు విపక్షాలు పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంపై నిలదీయబోతున్నట్లుగా తెలుస్తోంది.