నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ వందేమాతరంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య వాడీవేడీగా సాగుతోంది. కాంగ్రెస్ నేత, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా.. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) సహా బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశ ప్రయోజనాల కంటే ఎన్నికలకే బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. సభలో పదే పదే అంతరాయాలు, గందరగోళాన్ని సృష్టిస్తూ పాలక పార్టీ ఎన్నికల హడావుడిగా ముందుకు సాగుతోందని.. కానీ, కాంగ్రెస్(Congress) జాతీయ విలువల కోసం పోరాడుతుందని ఆమె అన్నారు. దేశ ప్రయోజనాలపై పోరాడేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు ప్రియాంక.
మీరు ఎన్నికల కోసమే ఇక్కడ కూర్చొన్నారు. తాము దేశం కోసం ఉన్నామని, ఎన్నికల్లో పరాజయాలనేవి పార్లమెంటు()లో పార్టీ స్వరం వినిపించకుండా ఆపలేవు. తాము ఎన్నికల్లో ఓడిపోతూనే ఉన్నా.. ఇక్కడే కూర్చుని మీతో(బీజేపీ) పోరాడుతూనే ఉంటామని ప్రియాంక ధ్వజమెత్తారు. వందేమాతరాన్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదని, పశ్చిమ్ బెంగాల్లో(West Bengal) రాబోయే ఎన్నికల సందర్భంగానే ఈ అంశాన్ని లేవనెత్తినట్టుందని మండిపడ్డారు.



