– డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సఫారీ, ఆసీస్ క్రికెటర్లు
ముంబయి: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు దూరం కానున్నారు. ఐపీఎల్18 ఈ నెల 17 నుంచి పున ప్రారంభం కానుండగా.. మే 27న గ్రూప్ దశ మ్యాచులు ముగియనున్నాయి. మే 27 తర్వాత దక్షిణాఫ్రికా క్రికెటర్లను వదిలేయాలని బీసీసీఐ ప్రాంఛైజీలకు తెలిపింది. జూన్ 11 నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనున్నాయి. కగిసో రబాడ, ఎడెన్ మార్‌క్రామ్, మార్కో జాన్సెన్, ట్రిస్టన్ స్టబ్స్, లుంగి ఎంగిడి, వియాన్ ముల్డర్, రియాన్ రికెల్టన్, కార్బిన్ బాచ్‌లు మే 30న లండన్‌కు చేరుకోనున్నారు. ఇతర సఫారీ క్రికెటర్లు ఐపీఎల్ ఫైనల్ వరకు లీగ్‌లో ఆడనున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు సైతం గ్రూప్ దశ మ్యాచుల అనంతరం ఐపీఎల్ నుంచి వెళ్లిపోనున్నారు.
భారీ ప్రైజ్‌మనీ: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచే జట్టు భారీ ప్రైజ్‌మనీ అందుకోనుంది. రూ.49.28 కోట్ల ప్రైజ్‌మనీలో చాంపియన్ జట్టు రూ. 30.38 కోట్లు, రన్నరప్ జట్టు రూ.18.48 కోట్లు అందుకోనుండగా.. మూడో స్థానంలో నిలిచిన భారత్ రూ.12.32 కోట్లు దక్కించుకోనుంది. ఈ మేరకు నగదు బహుమతిని గత రెండు సీజన్ల కంటే రెట్టింపు చేస్తూ ఐసీసీ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్లే ఆఫ్స్‌కు దూరం
- Advertisement -
- Advertisement -