Thursday, December 25, 2025
E-PAPER
Homeజిల్లాలునట్టల నివారణ మందులు పంపిణీ

నట్టల నివారణ మందులు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ

పశువైద్య , పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బాల్కొండ మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో బుధవారం నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 1137 మేకలు గొర్రెలకు సరిపడా మందులు పంపిణీ చేసినట్లు పశువైద్య అధికారి డా. ఉజ్వల తెలిపారు. ఈ మందులను గ్రామ సర్పంచ్ పోలేపల్లి హేమలత లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ ఎంబరి నర్సయ్య చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవాల పెంపకం దారులు చిన్న మల్లయ్య, మహేందర్, నాగేష్, మనీష్, గోపాలమిత్ర షకీల్ , బషీర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -