- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ రెడ్డి హనుమాన్ దేవాలయంలోని భక్తుల సౌకర్యార్థం, ఉన్నఉరు కన్నతల్లి అంటూ తన స్వగ్రామం కోసం ముందుకు వచ్చి రూ.40 వేలు విలువైన బోరుబావికి బోర్ మోటారును బహుకరించాడు. సోమవారం తన వంతు సహాయం చేసి సర్పంచ్ చంద్రగిరి సంపత్, ఉప సర్పంచ్ బడితేల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య, అయ్యప్ప భక్తులు, హనుమాన్ భక్తులు, గ్రామస్తుల సమక్షంలో అందజేసి ఆదర్శంగా నిలిచారు. ఇందుకు శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -



