Thursday, September 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డోoగ్లీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గజానన్ దేశాయ్ మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్  చేతుల మీదుగా లబ్దిదారులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆసరాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పరమేశ్ పటేల్ , శివాజీ పటేల్, దినదయాల్ పటేల్, ఉమాకాంత్ పటేల్, యూనుస్ పటేల్ ,లక్ష్మణ్ పటేల్, నాగేష్ పటేల్, శివా రెడ్డి, విలాస్, సాయలు గోండా,లక్ష్మణ్,  అర్జున్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -