Tuesday, September 16, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వం  హామీలను  నెరవేర్చాలని వినతి…

ప్రభుత్వం  హామీలను  నెరవేర్చాలని వినతి…

- Advertisement -

నవతెలంగాణ -ముధోల్  : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సోమవారం బిజెపి మండల అధ్యక్షులు కోరి పోతన్న ఆధ్వర్యంలో బిజెపి నాయకులు డిప్యూటీ తహశీల్దార్ తెలంగ్ రావు కు  వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయం లేదని బిజెపి  నాయకులు పేర్కొన్నారు. రైతులకు పంట నష్టపరిహారం, రుణమాఫీ, పింఛన్లు, అర్హులైన లబ్దిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు . ఎన్నికల్లో  ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కోరి పోతన్న,దేవోజి భూమేష్, సప్పటోల్ల పోతన్న,తాటివార్ రమేష్,సాయినాథ్,  మోహన్ యాదవ్, శ్రీనివాస్, జీవన్,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -