నవతెలంగాణ – మల్హర్ రావు
ఆడపడుచులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా మల్లారం గ్రామంలో రెండవ విడత చీరల పంపిణీ కార్యక్రమాన్నీ సోమవారం గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్ పంపిణీ చేశారు. ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ప్రభుత్వం రేవంత్ అన్న కానుకగా 28 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరల పంపిణీ చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అవిర్నేని పురుషోత్తంరావు, వార్డు సభ్యులుమధు, వెంకటేష్, శ్రీను, దేవేందర్, కొమరయ్య, కాంగ్రెస్ నాయకులు ప్రకాష్ రావు, ఎల్ శ్రీధర్, మురళి, రాజేశ్వరరావు, రేవల్లి లింగయ్య, నక్క బొందయ్య, భూక్య రాజు నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు కలువల రవిసాగర్, శేఖర్, మహిళలు పాల్గొన్నారు.
మల్లారంలో ఇందిరమ్మ చీరల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



