– ఈ ప్రాంతం నుండి ఐఏఎస్,ఐపీఎస్‌కు ఎంపిక నా కల
– జీఎస్‌జీ ట్రస్ట్ చైర్మన్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలోని కోట్ మర్పల్లి జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థినీ విద్యార్థుల కు జిఎస్‌జి ట్రస్ట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నోట్బుక్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన స్తోమతకు తగ్గ సహాయ సహ కారాలు పేద విద్యా ర్థుల కోసం చేయాలని ఈ కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. మారుమూల గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యా ర్థులు అత్యున్నత స్థానాలకు చేరుకోవడం ఐఏఎస్, ఐపీఎస్ కు లక్ష్యంగా చదువుకునే విద్యార్థులకు, ఎంపికైన విద్యార్థు లకు చదువు పూర్తి అయ్యేవరకు ఖర్చులు భరిస్తానన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మధునాచారి, అరవింద్, ఉపాధ్యా యులు ఉమారాణి, మాణిక్యం, ప్రేమ్ కుమార్, శ్రీనివా సరావు, విజరుకు మార్, రాజేందర్, పుష్పకుమారి, జిఎస్ జిఎస్‌జీటస్ట్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.