విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ వితరణ

నవతెలంగాణ — తంగళ్ళపల్లి
మండలంలోని అంకుసాపూర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిలను శనివారం వితరణ చేశారు. అదే గ్రామానికి చెందిన సల్లారపు బాపురెడ్డి  వారి నాన్న సల్లారపు రామిరెడ్డి   జ్ఞాపకార్థం గ్రామంలోని ప్రాధమికోన్నత పాఠశాలలో విద్యార్థులందరికీ స్టీల్ వాటర్ బాటిల్స్ వితరణ చేశారు. కార్యక్రమంలో సల్లారపు బాపురెడ్డి దంపతులు వారి కుటుంబ సభ్యులు, సర్పంచ్ కోహెడ ఎల్లవ్వ- నాంపెల్లి, ఉప సర్పంచ్ క్యారం నాగరాజు, పాఠశాల యజమాన్య కమిటీ చైర్మన్ చిలకపల్లి రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కె. జనార్ధన్,ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Spread the love