నవతెలంగాణ – గండీడ్
తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోనేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ (NMEO)పథకం ద్వారా ప్రస్తుత సీజన్ లో వేరుశనగ విత్తనాలు జిజేజి-32 రకం ను మండల రైతు ఉత్పత్తి దారుల సంఘం ద్వారా 100% సబ్సిడీపై పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి శనివారం సల్కర్ పేట్ రైతు వేదికలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా మండలంలో సుమారు 625 ఎకరాల్లో వేరుశనగ సాగు అవసరమైన విత్తనాలను మహిళా రైతు దారుల సంఘం సభ్య రైతులకు మాత్రమే పంపిణీ జరుగుతుందన్నారు. GJG-32 రకం అధిక దిగుబడులు ఇచ్చే, వర్షాధార పంటలకు అనుకూలమైన, పెద్ద గింజలతో కూడిన విత్తనం. ఈ రకంలో ఎక్కువ నూనె శాతం, వ్యాధులపై నిరోధకత, సమానంగా పండే లక్షణాలు ఉండి, తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అత్యంత అనుమైందన్నారు.
దేశీయంగా నూనె గింజల ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం ప్రధాన లక్ష్యమని,రైతులు FPO ద్వారా విత్తనాలను పొందాలని పంట నిర్వహణ,అధిక దిగుబడులు సాధించడానికి వ్యవసాయశాఖ సిబ్బంది సాంకేతిక సలహాలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం చైర్మన్ లక్ష్మీనారాయణ,మండల వ్యవసాయ అధికారి నరేందర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,సీసీ.వసంత, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రీకాంత్, సమత,శివలీల, రైతులు పాల్గొన్నారు.