Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలకు వాటర్ క్యాన్ లు పంపిణీ

మహిళలకు వాటర్ క్యాన్ లు పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రంలోని స్వర్ణ భారతి మండల సమాఖ్య కార్యాలయంలో మహిళలకు బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి మహిళలకు వాటర్ క్యాన్ లు పంపిణీ చేశారు. మహిళలు సమాజంలో సగభాగం అని వ్యాఖ్యానించారు. డ్వాక్రా సంఘాలతో మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందుతున్నారని తెలిపారు. మహిళలకు వాటర్ క్యాన్స్ పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఏపీఎం రవీందర్, నాయకులు ఆకుల సురేందర్ రావు, ఎండి నాయిమ్, మాచర్ల ప్రభాకర్, మచ్చ రమేష్, పిరని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -