Saturday, September 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డాగ్ అడాప్షన్,వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్ పెంచాలి

డాగ్ అడాప్షన్,వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్ పెంచాలి

- Advertisement -

– రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : డాగ్ అడాప్షన్,వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ పై జిల్లా యంత్రాంగం అవేర్నెస్  పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. అధికారులకు ఆదేశించారు. శనివారం నల్లగొండ పట్టణంలోని రాంనగర్ పార్క్ లో డాగ్ అడాప్షన్,వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్,పలు అంశాల అవగాహన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడారు దేశంలో కుక్క కాటుతో ఎంతో మంది చనిపోతున్నారని ఇటీవల వార్తల్లో చూస్తున్నాము.ఈ విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పందించిందనీ చెప్పారు

నల్గొండ జిల్లాలో సుమారు 40 వేల కుక్కలున్నట్లు అధికారులు అంచనా వేశారనీ అమెరికా లాంటి దేశంలో మనుషుల్లాగే కుక్కలకు కూడా విలువ ఇస్తున్నారు అని పేర్కొన్నారు కుక్కలను ఎవరు ంపాల్సిన అవసరం లేదు. పాపం మూట కట్టుకోవద్దని సూచించారు. 

కుక్కలను దత్తత తీసుకునే కార్యక్రమం మంచి కార్యక్రమం  ఇలాంటి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం అని ప్రకటించారు హైదరాబాద్ తర్వాత రెండవ అతిపెద్ద ప్రోగ్రాం నల్గొండలో నిర్వహించామన్నారు..కుక్క కాటుకు గురికాకుండా ఉండేలా,ఒకవేళ గురైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు విస్తృతం చేయాలి అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల  లక్ష్మారెడ్డి అదనపు కలెక్టర్ అమిత్ నారాయణ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -