నవతెలంగాణ-కల్వకుర్తి టౌన్
ఈనెల 10న కల్వకుర్తి పట్టణంలో 14 16 సంవత్సరాల బాలికలకు అథ్లెటిక్ పోటీలు నిర్వహించినట్లు అధ్యక్షులు కార్యదర్శి డాక్టర్ ఎం విజేందర్ యాదవ్ డాక్టర్ సోలపోగుల స్వాములు ఈనెల 10న ఉదయము ఎనిమిది గంటలకు 14 మరియు 16 సంవత్సరాల లోపు బాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు జిల్లా స్థాయిలో బాలికల క్రీడా ప్రతిభను వెలికితీసి, వారిలో క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యం, మరియు నాయకత్వ గుణాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ASMITA LEAGUE సభ్యులు నిర్వహిస్తున్నారని.ఈ లీగ్ 2025 నవంబర్ 10న కల్వకుర్తి జెడ్పిహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ప్రాంగణంలో జరగనుంది*.జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సీనియర్ క్రీడాకారులు, మరియు బాలికలు అందరూ కీలక పాత్ర పోషించాలని జిల్లా క్రీడా సంఘం అధ్యక్ష మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ విజేందర్ యాదవ్ మరియు డాక్టర్ సోలపోగుల స్వాములు గారు కోరారు.
పోటీ వర్గాలు:
*అండర్* *14 బాలికలు*: 21.12.2011 నుండి 20.12.2013 మధ్య జన్మించిన వారు
*అండర్* *16 బాలికలు*: 21.12.2009 నుండి 20.12.2011 మధ్య జన్మించిన వారు
ప్రతిభ గుర్తింపు:
ఈ లీగ్ ద్వారా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (AFI) నియమించిన ప్రత్యేక బృందం ప్రతిభావంతమైన యువ అథ్లెట్లను గుర్తిస్తుంది.
ప్రధాన క్రీడా ఈవెంట్లు:
స్ప్రింట్లు, డిస్కస్ త్రో, షాట్‌పుట్, జావెలిన్ త్రో, లాంగ్ జంప్, మరియు హై జంప్‌లలో బాలికలు తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
అండర్-14 బాలికల
ఈవెంట్లు
ట్రయాథ్లాన్-A
60మీ., లాంగ్ జంప్ (5మీ. అప్రోచ్), హై జంప్ (Scissor)
ట్రయాథ్లాన్-B
60మీ., లాంగ్ జంప్ (5మీ. అప్రోచ్), బ్యాక్ త్రో (1kg షాట్‌పుట్)
ట్రయాథ్లాన్-C:
60మీ., లాంగ్ జంప్ (5మీ. అప్రోచ్), 600మీ., కిడ్స్ జావెలిన్ (5మీ. రన్‌వే)
అండర్-16బాలికల ఈవెంట్లు:
60మీ., 600మీ., హై జంప్ (Scissors), లాంగ్ జంప్ (5మీ. అప్రోచ్), డిస్కస్ త్రో, షాట్‌పుట్ (3కిలోలు – స్టాండింగ్), జావెలిన్ త్రో (500గ్రా – 10మీ. అప్రోచ్).
ఈ ASMITHA LEAGUE ద్వారా గ్రామీణ స్థాయిలో బాలికల్లో క్రీడా ఆసక్తి, ఆత్మవిశ్వాసం, మరియు సమాన అవకాశాలను పెంపొందించి, భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు మహిళా క్రీడాకారిణులను తయారు చేయడం ప్రధాన ఉద్దేశ్యం.



