Sunday, February 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల కేంద్రంలో జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్ ప్రారంభం

మండల కేంద్రంలో జిల్లాస్థాయి ఖో ఖో టోర్నమెంట్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – చౌటకూర్ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులపాటు జరుగనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి సీజన్ 3 ఖో ఖో ఓపెన్ టు ఆల్ క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి.ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ జిల్లా ఖో ఖో అసోసియేషన్ అధ్యక్షులు శాగని హరికిషన్ గ్రామ సర్పంచ్ పార్కల రాం రెడ్డి, సరఫ్ పల్లి సర్పంచ్ రాంచంద్ర రెడ్డి తో కలిసి ప్రారంభించారు ఉమ్మడి మెదక్ జిల్లా నుండి18 జట్లు పోటీ పడుతున్నాయి. క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు పాఠశాలలో వసతి ఏర్పాటు చేసి భోజన సౌకర్యాలు ఏర్పరిచారు. ఆదివారం సెమీ ఫైనల్,ఫైనల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు.ఎల్ఈడి, ప్లడ్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో సైతం క్రీడలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని జిల్లా ఖో ఖో అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు.పోటీల్లో గెలుపొందిన జట్లకు ప్రథమ బహుమతిగా రూ.20,000, ద్వితీయ బహుమతి రూ.15,000, తృతీయ బహుమతి10,000 రూపాయలతో పాటు ట్రోఫీలను అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రామాగౌడ్, గ్రామ అధ్యక్షులు వర్కల రమేష్, కోశాధికారి నాగాగౌడ్, సంయుక్త కార్యదర్శి త్రిశూల్, ఉపాధ్యక్షులు కార్తీక్, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్, అరుణ, ఉపసర్పంచ్ దమ్మి నాగరాణి కృష్ణ, వార్డు మెంబర్లు, ఆర్గనైజర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -