Tuesday, November 4, 2025
E-PAPER
Homeజిల్లాలుఈ నెల 18న మత్స్య కార్మిక సంఘం జిల్లా మహాసభలు

ఈ నెల 18న మత్స్య కార్మిక సంఘం జిల్లా మహాసభలు

- Advertisement -
  • ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ-తలకొండపల్లి: రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహ్మా తెలిపారు. సోమవారం మండల పరిధిలోని వెల్జాల్ సహదేవ సముద్రం చెరువు వద్ద పోస్టర్ ఆవిష్కరణ. తెలంగాణ మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం వెల్జాల్, చంద్రధమ, రాంపూర్, తలకొండ పల్లి, గ్రామాలలో లోని మత్స్య కారులను టీఎంకె ఎంకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నర్సింహా వెల్జాల్ లోనీ సహదేవ సముద్రం చెరువును పరిశీలించారు. అనంతరం ఈనెల 18న కడ్తాల్ మండల కేంద్రంలో జరిగే సంఘం జిల్లా మహాసభల పోస్టర్ చెరువు అలుగు వద్ద విడుదల చేశారు.

అదేవిధంగా మత్స్యకారుల కోసం ప్రభుత్వాలు రూ,5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలని, ప్రతీ మత్స్య సొసైటీ బ్యాంకు అకౌంట్లలో రూ,10 లక్షల రూపాయల నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నవంబర్ నెల వచ్చిన ఇప్పటికి చేప పిల్లలు ఇవ్వకపోవడం సరింది కాదని విమర్శించారు. సొసైటీల అకౌంట్ లలో నగదు జమ చేయకుండా రెండు విధాలా మత్స్యకారులను నష్టం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చేప పిల్లలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2001-2025 వరకు నాటి నుండి నేటి వరకు దేశ, రాష్ట్రంలోని అనేక పరిణామాలను,ఘటనలను ఎదుర్కొంటూ సంఘం ముందుకు పోతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య కారుల సమస్యలపై సంఘం అనేక రాజీలేని పోరాటాలు నిర్వహించి ఎన్నో విజయాలు సాధించడం జరిగింది.

మత్స్యకారుల జీవిత భద్రత,ఇన్సూరెన్స్,ఎక్స్‌ గ్రేశీయ పెంపుదల కోసం జల వనరులపై పూర్తి హక్కులు మత్స్యకారులకే ఉండే విదంగా చట్టాలు చేయించడం, ఉచిత చేప పిల్లల పంపిణీ, చెరువులు, కుంటలు కబ్జాలు, కాలుష్యాలకు గురికాకుండా, మత్స్య మహిళలకు సొసైటీలు, ఋణాలు, మత్స్యకారులకు మోటార్ సైకిళ్ళు,నాలుగు చక్రాల వాహనాలు ఇవ్వాలని, మత్స్య సంపదకు గిట్టుబాటు ధర, మార్కెట్ వసతి పోరాడి సాధించే దాంట్లో, విజయం సాధించడంలో సంఘం కీలకమైన పాత్ర పోషించిందని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో రూ,8 లక్షలు కుటుంబాలు, దేశంలో రూ,3 కోట్ల కుటుంబాలు మత్స్య వృత్తిపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులు అభివృద్ధికి బడ్జెట్ లో నిధుల కేటాయింపు వృత్తి రక్షణ, ఉపాధికి నిర్దిష్టంగా చర్యలు తీసుకునేదాంట్లో చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. పట్టణీకరణ, పారిశ్రామీకరణ పేరుతో పెద్దఎత్తున జలవనరులు, చెరువులు, కుంటలు, కబ్జాలు,కాలుష్యానికి గురౌతున్నాయి.

ఫలితంగా వృత్తికి,ఉపాధికి దూరమై ఇతర పనులకు, ప్రాంతాలకు వలసలు వెల్లి దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని హైడ్రా వచ్చిన అంతాంత మాత్రమే పని చేస్తుందని బాలాపూర్ మండలం లో అనేక చెరువులు కుంటలు కబ్జాలు గురైన అలాంటి వారి పైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈనెల 18న కడ్తాల్ మండల కేంద్రలో మత్స్యకారుల జిల్లా మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, మత్స్యకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్జాల్ సొసైటీ అధ్యక్షులు బాలకిష్టయ్య, ఎస్ వెంకటయ్య, చౌదర్ పల్లి మాజీ సర్పంచ్ చంద్రయ్య, మల్లేష్, రాంపూర్ సొసైటీ అధ్యక్షులు తిక్కల వెంకటేష్,గొర్ల కాపర్ల సంగం మండలం నాయకులు జె పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -