వర్షాబావ పరిస్థితుల వల్ల తగ్గిన దిగుబడులు..
లబో దిబో మంటున్న రైతన్నలు..
నవతెలంగాణ-కుబీర్
మండలంలోని రైతాంగం ఈ ఏడాదిలో లో ఖరీఫ్ సీజనలో 50వేల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో పత్తి పంట 25 వేల ఎకరాల్లో సాగుచేయగా, సొయా పంట 21 వేలు, కంది 2500, వరి 250, పసుపు 200 ఎకరాల్లో సాగు చేశారు. దింతో ఈఏడాది లో ఎల్ ని నో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గే ప్రభావం ఉందని రైతులు వాపోతున్నారు.
మరోవైపు మండలంలో ఆయా గ్రామల్లో రైతులు సొయా పంట కోతలు ప్రారంభించారు. సొయా కోతలు ఒకేసారి రావడంతో కూలీలు, యంత్రాలు సమయానికి లభించకపోవడంతో చేసేదేంలేక తప్పని పరిస్థితుల్లో ఎకరానికి రూ. 3200 నుంచి రూ. 3500 వరకు కోతకు చెల్లించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఎల్ ని నో ప్రభావం వల్ల గత ఏడాది కంటే ఈఏడాదిలో దిగుబడులు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులో పడుతున్నారు. గత సంవత్సరంలో సొయా పంట ఎకరనికి 8-9 క్వాంటల్ వరకు దిగుబడులు వస్తే.. ఈఏడాదిలో సొయా పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని రైతన్నలు వాపోతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర రూ.5708 ప్రకటించినా.. ఆశించినంత దిగుబడి రాకపోవడంతో మద్దతు ధరకంటే అధిక ధరలకు కొనుగోళ్లు చేస్తున్నారు.







కామెంట్‌లు (0)