Magazines

మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం

1 గంట క్రితం

help
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం

-మానవతా దృక్పథంతో బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నాయకులు.

 నవతెలంగాణ-జన్నారం:  దండేపల్లి మండలం రాజంపేట (కొరివిచెల్మ) గ్రామానికి చెందిన నల్లూరి గంగన్న ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతా దృక్పథంతో స్పందించి, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు ప్రేరణతో, ఏఐసీసీ కేకేసీ కాంగ్రెస్ పార్టీ కమిటీ మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి కమ్ కోఆర్డినేటర్ బత్తుల వెంకటేష్ మృతుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలవడం, కష్టకాలంలో వారికి భరోసా కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్