నవతెలంగాణ- ఆర్మూర్: ఆడపిల్లలకు ,మహిళలకు ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పోస్టల్ పథకాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పట్టణ హెడ్ పోస్ట్ మాస్టర్ బోడ కిషన్ శుక్రవారం తెలిపారు. ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ సబ్ డివిజన్ కింద 200 లకు పైగా పోస్ట్ ఆఫీస్ లు ఉన్నట్టు దాదాపుగా 30 కోట్ల వరకు వృద్ధాప్య పింఛన్లను పోస్టల్ ద్వారా అందజేస్తున్నామని,వ్యక్తిగత ప్రమాద బీమా పథకం తో పాటు,ఐదు సంవత్సరాలు నిండిన చిన్నారులకు ఆధార్ నమోదు ఉచితంగా చేయబడునని తెలిపారు.
పోస్టల్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
49 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 09, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)