Magazines

అనుమానస్పదంగా మహిళ మృతి 

58 నిమిషాల క్రితం

Women die
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-కుభీర్
మండలంకలోని న్యూ సౌంలీ గ్రామానికి చెందిన సుశీల (27) మంగళవారం ఉదయం తన ఇంటి ముందర షెడ్డులో అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు కుటుంబ సభ్యులు తెలపిన వివరాలు ప్రకారం.. సుశీల మృతురాలికి పది సంవత్సరాల క్రితం వివహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కొంతకాలంగా సుశీల భర్తతో పాటు అత్త మామలు తరుచూ వేధింపులు పెట్టేవారని తల్లి మాలేపు సంధ్య ఆరోపించారు. నా కుమార్తె మృతిలో ముగ్గురి ప్రమేయం ఉందని పోలిసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృత దేహాన్ని పోస్ట్ మర్దన్ నిమిత్యం బైంసా అస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, వేధింపులే మరణానికి దారి తీశాయా లేదా మరి ఏదైనా కారణం ఉందా అనే కోణంలో ఎస్సై కృష్ణారెడ్డి, సిబ్బంది విచారణ చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్