Magazines

కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు

57 నిమిషాల క్రితం

Kbr Park
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

కొత్త స్టీల్ బ్రిడ్జికి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

నవతెలంగాణ - హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని కేబీఆర్ నేషనల్ పార్క్ చుట్టూ గతంలో ప్రతిపాదించిన బహుళ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో సరికొత్తగా డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో సుమారు రూ. 1,200 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది.

సవరించిన ప్రణాళిక ప్రకారం, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ముఫఖంజా కాలేజీ వరకు ఆరు లేన్ల స్టీల్ ఎలివేటెడ్ కారిడార్ (స్టీల్ బ్రిడ్జి) నిర్మించనున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం.1 వైపు వెళ్లేందుకు వీలుగా దీనికి ఒక ర్యాంప్‌ను కూడా అనుసంధానిస్తారు. గతంలో ఈ పనులకు సంబంధించి కేఎన్ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఇచ్చిన 'లెటర్ ఆఫ్ అవార్డు'ను ఉపసంహరించుకుని, కొత్త డిజైన్ బాధ్యతలను మేఘా ఇంజినీరింగ్‌కు అప్పగించారు. భూసేకరణ వ్యయం తగ్గడం వల రూ. 800 కోట్లు, నిర్మాణ ఖర్చు తగ్గడం వల్ల మరో రూ. 400 కోట్లు కలిపి మొత్తం రూ. 1200 కోట్లు ఆదా అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్