Magazines

ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం

52 నిమిషాల క్రితం

Day of Older Persons
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్ 
36వ అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని ఆలేరుకి చెందిన పలువురిని సి. ఓ. జిల్లా పరిషత్ చిలుకూరి శ్రీనివాస్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఇన్చార్జి శాలువా మెమొంటో ఇచ్చి పలువురుని మంగళవారం ఘనంగా సన్మానించారు. కలెక్టర్ ఆఫీసులో అడిషనల్ కలెక్టరు, డిఆర్డిఏ ఇతర ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. సీ. వో. జిల్లా పరిషత్ సీఈవో , చిలుకూరి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ యాదగిరిగుట్ట లో దైవ దర్శనానికి వయోవృద్ధులకు ఒక గంట ఉచిత దర్శనము ఏర్పాటు చేస్తామాని హామీ ఇచ్చారు.


వయోవృద్ధులందరూ యూనిటీగా ఉండాలని అధైర్య పడొద్దు, ఆరోగ్యముగా ఉండాలని సూచనలు ఇచ్చారు. జిల్లా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ ప్రతి గురువారము వయోవృద్ధులకు ఉచిత సేవలు అందిస్తామని,ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేస్తామని వయోవృద్ధులకు  వివరించారు, వీరందరి మధ్యన వయోవృద్ధులకు సేవలందించినందుకు బొమ్మగంటి లక్ష్మీనారాయణ గారికి అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండలము అధ్యక్షులు  చింతకింది మల్లయ్య , ప్రధాన కార్యదర్శి పరిగెల రాములు , ఉపాధ్యక్షులు చిలుక రామ్ నరసయ్య , వల్లాల మధుసూదన్ , జిల్లా కౌన్సిలర్ ఒగ్గు క్రిష్టఫర్,  గాదె రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్