Magazines

సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి

1 గంట క్రితం

cpim
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు మాచర్ల భారతి 

- ఈసీఐ విశ్వసనీయతను కాపాడాలి 

- మాదినేని రమేష్, శీలం సత్యనారాయణరెడ్డి

నవతెలంగాణ-సత్తుపల్లి 

కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర క మిటీ సభ్యురాలు మాచర్ల భారతి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్, డివిజన్ కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. ​స్థానిక రావి వీర వెంకయ్య భవన్‌లో ఆదివారం చలమాల విఠల్ రావు అధ్యక్షతన సీపీఐ(ఎం) సత్తుపల్లి డివిజన్ కార్యదర్శివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భారతి, రమేష్, సత్యనారాయణరెడ్డి మాట్లాడారు. ​ఎన్నికల సంఘం స్వతంత్రత, పారదర్శకత, విశ్వసనీయతపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీఐపై ఉందన్నారు. ​ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని వారు స్పష్టం చేశారు.‌


ఇటీవల ఎన్నికల సంఘం పనితీరు, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. ​ఈసీ తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలపై వస్తున్న సందేహాలకు పారదర్శకమైన సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ​ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీల పట్ల సమాన దూరం పాటిస్తూ, రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థగా వ్యవహరించాలని భారతి, రమేష్, సత్యనారాయణరెడ్డి కోరారు. ఓటర్ల హక్కులను పరిరక్షిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజాస్వామ్య నమ్మకాన్ని కాపాడేందుకు జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. ​ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మోరంపూడి పాండురంగారావు, జాజిరి శ్రీనివాస్, కార్యదర్శివర్గ సభ్యులు కొలికపోగు సర్వేశ్వరరావు, అయినాల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్