నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎంపిక సమావేశం స్థానిక చెర్రీస్ రెస్టారెంట్‌లో సోమవారం జరిగింది. తాజా మాజీ అధ్యక్షుడు తోట కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సత్తుపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్, మనం దినపత్రిక రిపోర్టర్ తడికమళ్ల దేవదానం (దేవా), ప్రధాన కార్యదర్శిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ చీపు గంగాధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి పేర్లను మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మాదిరాజు సుధాకర్, భీమిశెట్టి రాము, ఎండి షైబుద్దిన్, చీనేని బాలకృష్ణ బలపరిచారు.
అర్హత గల జర్నలిస్టులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని నూతన అధ్యక్ష కార్యదర్శులు స్పష్టం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను తోటి సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు.
ఈ సమావేశంలో బొల్లిపోగు సురేష్, శీలం శ్రీనివాసరెడ్డి, జీడిమళ్ల శ్రీనివాసరావు, యనమాల విజయ్, కొర్ర బాలాజీ, కొత్తపల్లి సుధాకర్, నల్లంటి మోహన్, బేతి ఆనంద్, షేక్ మీరా, బాజీ, మారోజు, అశోక్, మేరాజ్, ఒబిలిశెట్టి రామారావు, బండారు ఉమామహేశ్వరరావు, కోపూరి సాంబశివరావవు కాకర్ల జగన్, బల్లెం చిరంజీవి, హరిబాబు, చందు, విష్ణు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)