Magazines

సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ‘జెర్సీలు’ పంపిణీ

1 గంట క్రితం

medical camp
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-సత్తుపల్లి 

​కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 6, 7, 8 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ జరుగనున్నాయి. ​ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు సత్తుపల్లిలోని సత్యవతి నేత్ర వైద్యశాల సౌజన్యంతో రూ.10 వేల విలువైన స్పోర్ట్స్ డ్రెస్సులను ఆ ​ఆసుపత్రి వైద్యులు డాక్టర్ కట్టా శివాజీ చేతుల మీదుగా మంగళవారం విద్యార్థులకు అందించారు. వాలీబాల్ పోటీల్లో సత్తుపల్లి విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని డాక్టర్ శివాజీ ఆకాంక్షించారు. ​క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయని ఆయన పేర్కొన్నారు. ​క్రీడాకారులకు ఉచితంగా జెర్సీలు అందించి ప్రోత్సహించిన దాతలకు కళాశాల బృందం ధన్యవాదాలు తెలిపింది. ​ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ ఊకే సాయికృష్ణతో పాటు వాలీబాల్ జట్టు సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక సుమాంజలి ఫొటో స్టూడియో బాధ్యులు మల్లికంటి రాము ఆధ్వర్యంలో జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్