Magazines

జేవీఆర్ డిగ్రీ కళాశాల 'పూర్వ విద్యార్థుల' సంఘ సమావేశం

1 గంట క్రితం

JVR Degree College
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం

- స్వర్ణోత్సవాల నిర్వహణపై చర్చ

- 18న మరోసారి జరిగే సమావేశంలో ఎక్కువమంది పాల్గొనాలి

నవతెలంగాణ-సత్తుపల్లి 

​సత్తుపల్లిలోని జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పూర్వ విద్యార్థుల సంఘ సమావేశం ఆదివారం ఆ సంఘ అధ్యక్షుడు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ అధ్యక్షతన జరిగింది. ​త్వరలో అత్యంత వైభవంగా నిర్వహించనున్న జేవీఆర్ కళాశాల స్వర్ణోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు, ఇతర ముఖ్యమైన అంశాలపై దయానంద్ విజయకుమార్ మాట్లాడారు. స్వర్ణోత్సవాలను ఏ విధంగా విజయవంతం చేయాలనే విషయమై ఆయన పలు సూచనలను సమావేశంలో సభ్యుల ముందుకు తీసుకువచ్చారు. ​వేడుకల విజయవంతానికి తన వంతు సహకారం ఉంటుందని డాక్టర్ దయానంద్ విజయకుమార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ​ఈ క్రమంలోనే  ఈనెల 18వ తేదీన నిర్వహించబోయే తదుపరి సమావేశంలో అత్యధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొనాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.


​సమావేశాలకు హాజరయ్యేది ఎప్పుడూ ఆ నలుగురేనా..?

​జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవాల నిర్వహణకు సంబంధించి గత రెండు, మూడు నెలల నుంచి పలు దఫాలుగా సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నప్పటికి ​ఈ సన్నాహక సమావేశాలకు చాలామంది పూర్వ విద్యార్థులు స్థానికంగా ఉన్నప్పటికీ హాజరు కాకపోవడంపై సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. ​వాట్సాప్ గ్రూపులో సమావేశ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నప్పటికీ, స్పందించకుండా సభ్యులు రాకపోవడం పట్ల కొందరు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేశారు. ​ఎంతమంది ఉన్నా ప్రతిసారీ ఐదారుగురే హాజరవుతుండటంపై చర్చించిన సభ్యులు, రాబోయే రోజుల్లో భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. ​ఈ నేపథ్యంలోనే ఈనెల 18న జరగబోయే తదుపరి సన్నాహక సమావేశానికి పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరై సన్నాహక సమావేశాన్ని  జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి దారా కృష్ణారావు, ఉపాధ్యక్షుడు గాదె నరసింహారెడ్డి, కోశాధికారి మొరిశెట్టి సాంబశివరావు,  సభ్యులు రిటైర్డ్ ఆర్టీవో కృష్ణారెడ్డి, గీతాకుమారి, గుడ్లూరి రమణ, బాల నాగేశ్వరరావు, ఫయాజ్ ఆలీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్