Magazines

భద్రాద్రికి రైల్వే వసతి కల్పించండి

2 గంటల క్రితం

Minister Tummala
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

- కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

నవతెలంగాణ-సత్తుపల్లి 

​తెలంగాణలోని కీలక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీని పెంపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శనివారం కేంద్ర మంత్రితో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి తుమ్మల పలు నూతన రైల్వే మార్గాల ప్రతిపాదనలపై చర్చించారు. సత్తుపల్లి - కొవ్వూరు, పెనుబల్లి - అమరావతి, పాండురంగాపురం - భద్రాచలం మధ్య రైల్వే లైన్లను సాధ్యమైనంత తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.


​దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీరామచంద్రస్వామి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని రైల్వే మంత్రికి తుమ్మల  తెలిపారు. భక్తుల ప్రయాణ సౌకర్యార్థం భద్రాద్రికి నేరుగా రైలు వసతి కల్పించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్టుల వల్ల వ్యాపార, రవాణా రంగాలు అభివృద్ధి చెందడంతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య అనుసంధానం మరింత పెరుగుతుందని వివరించారు. రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ విషయమై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్