చెత్త తొలగింపును పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ రెహానా కమల్
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని విరాట్ నగర్ నుంచి సింగరేణి పీవీఎన్ కాలనీకి వెళ్లే రహదారికి ఇరువైపులా పేరుకుపోయిన చెత్తను జేసీబీ సాయంతో పూర్తిగా తొలగించే పారిశుద్ధ్య కార్యక్రమం ఆదివారం ముమ్మరంగా సాగింది. ప్రజలకు పరిశుభ్రమైన, సుందరమైన వాతావరణాన్ని అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్ తెలిపారు. ఈ పారిశుద్ధ్య పనులను ఆమె సత్తుపల్లి దగ్గరుండి పర్యవేక్షించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని, రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపాలిటీకి సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ కమల్ పాషా, గుడ్లూరి రవి, రాజు, స్థానిక కౌన్సిలర్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)