Magazines

ఇందిరమ్మ ఇళ్లలో సర్పంచుల పాత్రపై కలెక్టర్ కు వినతి 

2 గంటల క్రితం

Indiramma's houses
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

ఇందిరమ్మ ఇళ్లలో సర్పంచుల పాత్ర పై స్పష్టత ఇవ్వాలంటూ మండలంలోని యరగండ్లపల్లి,కొండూరు, అజ్జలాపురం,తమ్మడపల్లి,కె.బి పల్లి సర్పంచులు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎంపిక ఏ విధంగా జరుగుతుందనేది హౌసింగ్ అధికారులు తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వటం లేదని పేర్కొన్నారు.


గ్రామ ప్రథమ పౌరుడిగా గ్రామ ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్ కు ఇందిరమ్మ ఇళ్లలో బాధ్యత లేదా అని వారు ప్రశ్నించారు.లబ్ధిదారుల ఎంపిక, అర్హత పరిశీలన, జాబితా పై అభ్యంతరాల స్వీకరణ,నిర్మాణాల పర్యవేక్షణలో గ్రామ పంచాయతీల పాత్ర ఏమిటో సంబంధిత అధికారులు స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల రెండవ జాబితా పై వస్తున్న ప్రచారంలో నిజం ఎంత అనేది కూడా తమకు స్పష్టం చేయాలన్నారు.సెకండ్ ఫేజ్ లోనైనా సర్పంచులను భాగస్వాములు చేసి గ్రామ సభల ద్వారా ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక జరగాలని వారు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో యరగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్,అజ్జలపురం సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి,కొండూరు సర్పంచ్ సీతారాం నాయక్,తమ్మడపల్లి సర్పంచ్ కమ్మ చిచ్చు వెంకటేష్ ఉన్నారు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్