నవతెలంగాణ-మిడ్జిల్
మిడ్జిల్ మండలంలోని వాడియాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మహమ్మద్ ఉమార్ పాష బ్రెయిన్ స్ట్రోక్‌తో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన కుటుంబ పరిస్థితిని గమనించి, మంగళవారం పలువురు దాతలు కలిసి మొత్తం రూ.25,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
స్వచ్ఛంద సేవకుడు భాస్కర్ నాయక్ రూ.10,000/-, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రూ.10,000 /-, వాడియాల గ్రామ మాజీ సర్పంచ్ మంగమ్మ శ్రీనివాసులు రూ.5,000/- సర్పంచ్ చంద్రయ్య గౌడ్ తో కలిసి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
అనంతరం బీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు మాట్లాడుతూ..చిన్న వయసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మరణించడం కుటుంబానికి, పార్టీకి తీరనిలోటు అని పాండు అన్నారు. పార్టీ పరంగా మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని, కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాగరాజు, గ్రామ పెద్దలు యాదయ్య , బిక్షపతి , పురు నరసింహ, వెంకటయ్య, బెలే భీమయ్య, సుకుమార్, ఉదయ్ కుమార్, రవీందర్, ప్రమోద్ కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)