Magazines

రాజ్యాంగ నిర్మాతను కించపరిస్తే సహించం!

2 గంటల క్రితం

Police
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 2 నిమిషాల చదవడం

అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు.. అగ్గిమీద గుగ్గిలమైన యువత

విజయ్‌కృష్ణ, హైందవశక్తి ప్రసాద్‌పై కేసులు నమోదు చేయాలి

మక్తల్ పోలీసులకు అంబేద్కర్ యువజన సంఘం ఫిర్యాదు

నవతెలంగాణ–మక్తల్

రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైందవశక్తి ప్రసాద్‌ అంబేద్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు, పోస్టులు చేస్తున్నారని, వాటిని మక్తల్‌కు చెందిన విజయ్‌కృష్ణ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.


దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలను అరికట్టాలని పోలీసులను కోరారు. అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చరిత్ర, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై అవగాహన లేకుండా మత, కులపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సమాజానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణంలో అంబేద్కర్‌ కీలక పాత్ర పోషించారని, ఆయన ఆలోచనలు దేశ సామాజిక న్యాయానికి మార్గదర్శకంగా నిలిచాయని అన్నారు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యంలో సహజమే అయినప్పటికీ, ఒక మహనీయుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.


సోషల్‌ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సందర్భంగా పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. నిందితులపై వెంటనే కేసులు నమోదు చేసి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పృథ్వీరాజ్‌, జీర్గల్‌ నగేష్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి జగ్గలి అంజప్ప, యూత్‌ కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు బ్యాగరి సురేష్‌, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు అఫ్రోజ్‌, రవికుమార్‌, శ్రీనివాస్‌, ఓబులేష్‌, రాకేష్‌, రవికుమార్‌ బైని, తిమ్మరాజు, నర్సింలు, అక్షయ్‌, పోర్ల నరసింహులు, బండారి భీమేష్‌, నిరంజన్‌, కొలిమి రాజేష్‌, బండారి కథలప్ప, సందీప్‌, తల్వార్‌ నరేష్‌, బ్యాగరి శ్రీహరి, తరుణ్‌, వాకిటి రమేష్‌, కర్రెం అశోక్‌, జగ్గలి మారుతి, గొల్లపల్లి రాకేష్‌, గొల్లపల్లి నాగేష్‌, కోరి పవన్‌, చెన్నకేశవులు, పుట్ట ఉదయ్‌, వెంకటగిరి శ్రీకాంత్‌, జుట్ల అరవింద్‌, జుట్ల అనిల్‌, జగ్గలి నవీన్‌, కర్రెం సురేష్‌, రామాంజనేయులు, అరుణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్