నవతెలంగాణ - మర్రిగూడ
మండలంలోని లెంకలపల్లి గ్రామంలో కపాస్ కాంతి మిషన్ పర్ కాటన్ ప్రోడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల వ్యవసాయ అధికారులు రైతులకు పత్తి సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పత్తిలో సరైన విత్తన దూరాన్ని పాటించడం ద్వారా మొక్కల సంఖ్యను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు పంట పెరుగుదల, కలుపు నియంత్రణ, ఎరువుల వినియోగం, పురుగు తెగుళ్ల యాజమాన్యం వంటి అంశాలపై శాస్త్రీయంగా దృష్టి సారించవచ్చని వివరించారు.
రైతులు కేవలం సాంప్రదాయ పద్ధతులే కాకుండా శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించి తక్కువ ఖర్చుతో మెరుగైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుతం పంటలపై ఎల్ నినో ప్రభావం దానికనుగుణంగా పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయితగోని పద్మ వెంకటయ్య గౌడ్, వ్యవసాయ విస్తరణ అధికారి అరుణ, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.






కామెంట్లు (0)