నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు పట్టణంలో సోమవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా, ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరుతూ యూత్ సభ్యులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో అధికారంలోకి వచ్చి హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
పట్ట భద్రుల ఎన్నిక ద్వారా కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. యూత్ అధ్యక్షులు పూల శ్రావణ్ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్ యాట శివ, బీజని మధు కుమార్ ,కొలుపుల హరినాథ్, సెక్రటరీ జనరల్ కుండే సంపత్ ,మాజీ కౌన్సిలర్లు బేతి రాములు, కoదుల శ్రీకాంత్ ,బింగి రవి, మూర్తల రమణారెడ్డి ,రాయపురం నరసింహులు, కుతాటి అంజన్ కుమార్ , ఏలగల వంశీ , పల్లె మహేష్ , ఎలుగల హరికృష్ణ , అరిగ చంద్రశేఖర్, సీస సత్తయ్య గౌడ్, గట్టు రాజు , మెరుగు కృష్ణమూర్తి ,రేగటి వెంకటేష్ ,ఎండి ఫయాజ్, టింకు, శశి ప్రీతం, బి ఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)