- ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా ఉపాధ్యాయులకు సత్కారం
నవతెలంగాణ - అశ్వారావుపేట
పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ఉపాధ్యాయులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సన్మానించారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం గండుగులపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో అశ్వారావుపేట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు గురుకుల, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ప్రసాదరావుతో పాటు నారాయణపురం, అశ్వారావుపేట, గుమ్మడివల్లి, మైనార్టీ గురుకుల, బీసీ గురుకుల, సున్నంబట్టి, పెద్దవాగు ప్రాజెక్టు, కావడిగుండ్ల, అశ్వారావుపేట ఆశ్రమ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు ఎస్.వెంకటేశ్వర్లు, కొండలరావు, వీరేశ్వరరావు, సంగీత, రేణుకరాణి, శ్యామలాదేవి, రాంబాబు, నాగేంద్రమ్మలను ఎమ్మెల్యే సత్కరించారు. అలాగే ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన ఎల్.రేణుక, సిద్ధాంతపు ప్రభాకర్‌లను కూడా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఘనంగా సన్మానించారు. విద్యార్థుల ఉత్తమ ఫలితాల వెనుక ఉపాధ్యాయుల కృషి, అంకితభావం కీలకమని ఈ సందర్భంగా కొనియాడారు.






కామెంట్‌లు (0)