నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లాలోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సిడాం నాగేంద్ర సిబ్బందికి సూచించారు. పీఎం జన్మన్, ఆర్.బి.ఎస్.కే, ఆలన సిబ్బందితో వైద్య సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాగజ్ నగర్ రైల్వేస్టేషన్ కు వచ్చే లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ నందు కంటి, చెవి, మానసిక ఇతరత్రా పరీక్షలు, శస్త్రచికిత్సలు నిర్వహించనున్న దృష్ట్యా ఆరోగ్య సమస్యలు ఉన్న వారిని గుర్తించి వారి వివరాలను కార్యాలయంలో అందజేయాలని, శస్త్రచికిత్సకు అర్హులైన వారికి తగు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో చికిత్స అను వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని కోరారు. వైద్యులు సిబ్బంది సమయపాలన పాటించాలని లేకపోతే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్.బి.ఎస్.కె, పి.ఎం. జనరల్, ఆలన వైద్యులు, సిబ్బంది, కార్యాలయ డివై.ఎస్.ఓ. రమేష్ బాబు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)