సేవా జ్యోతి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలి
నవతెలంగాణ-ఆలేరు రూరల్
భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) ఆధ్వర్యంలో ఆలేరు మండలం శారాజీపేట గ్రామంలో పాత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు మంత్రి సాయిప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ పేరపు ఆనంద్, ఆలేరు 5వ వార్డు కౌన్సిలర్ పాశికంటి సంపత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ చేపట్టిన సేవా సంకల్ప అభియాన్లో భాగంగా అక్టోబర్ 7న నిర్వహించనున్న సేవా జ్యోతి బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీజేవైఎం ఆధ్వర్యంలో భువనగిరిలోని సాయిబాబా ఆలయం నుంచి ప్రిన్స్ కార్నర్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.కార్యక్రమానికి బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో అజయ్, మనోజ్,దుర్గాప్రసాద్,గౌరవ్దీప్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్లు (0)