Magazines

భీంగల్‌ ఎస్సై తిరుపతిని సస్పెండ్‌ చేయాలి

1 గంట క్రితం

SI TIRUPATI
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

సుధాకర్ మృతదేహంతో పోలీస్ స్టేషన్‌ ఆవరణలో బైటాయిస్తాం
వతెలంగాణ - భీంగల్ 

అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆత్మహత్యాయత్నం చేసుకున్న టీ స్టాల్‌ సుధాకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సుధాకర్ తన అత్మహత్యకు కారణం స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి, పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని సుధాకర్‌ మరణ వాంగ్మూలం ఇచ్చారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై సీపీ స్పందిస్తూ.. ఈ కేసులో పోలీసుల ప్రమేయం లేదనీ, పోలీసుల కారణంగా సుధాకర్‌ ఆత్మహత్యకు పాల్పడలేదని ప్రకటన జారీ చేయడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.


మరోవైపు బాల్కొండ ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, పట్టణ నాయకులు, ప్రజలు మాత్రం పోలీసుల వేధింపులు కారణంగా సుధాకర్ ఆత్మహత్య యత్నం చేశాడని ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ తిరుపతిపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం రోజు మంగళవారం భీంగల్ బందుకు పిలుపునివ్వగా మంగళవారం భీంగల్ బంద్ ప్రశాంతంగా కొనసాగించారు. హోటల్ చిరు వ్యాపారి సుధాకర్ ఆత్మహత్యను నిరసిస్తూ భీంగల్ పట్టణంలో వ్యాపారస్థులందరు స్వచ్చందంగా తమ తమ దుకాణాలను మూసి ఉంచి బంద్ పాటించారు. 


సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సుధాకర్ నిప్పంటించుకున్న పోస్టర్తో నిరాహార దీక్ష నిరసన, డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలో కుల సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు మాట్లాడుతూ... సుధాకర్ చనిపోవడానికి కారణమైనటువంటి వారిని 24 గంటల్లో వెంటనే శిక్షించాలని సిపిని కోరారు. లేదంటే మృతదేహంతో పోలీస్ ఆవరణలో కూర్చుంటామని, సుధాకర్ మృతదేహంతో పోరాడుతామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా సుధాకర్ మృతదేహాన్ని భీంగల్ కు తెస్తే జరిగే పరిణామాలపై పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పట్టణంలో భారీగా పోలీసులు మొహరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్