నవతెలంగాణ - భీంగల్
వీబీజీ రామ్‌జీ మెట్‌లకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మెట్ లు నిర్వహించాల్సిన బాధ్యతలు, విధులను ఎంపీడీఓ సంతోష్ కుమార్ క్షణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ..ప్రతి 40 మంది కూలీలకు ఒక మెట్‌ను నియమిస్తామని చెప్పారు. వీరు కూలీల హాజరు, కొలతలు, మాస్టర్ల నిర్వహణ, జాబ్‌కార్డుల నిర్వహణ తదితర పనులు చేపట్టాలని పేర్కొన్నారు.
కూలీలకు పనులు కల్పించడంతో పాటు పనుల నాణ్యతలో రాజీ పడకూడదని తెలిపారు. మెట్లు కూలీల సమీకరణలో భాగస్వాములై ఎక్కువ మంది కూలీలు పనికి హాజరయ్యే విధంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 27 గ్రామాలకు సంబంధించిన కొత్తగా ఎంపికైన మెట్లు, ఏపీవో జీ నర్సయ్య ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ టెక్నికల్ అసిస్టెంట్లు గణేష్ రమేష్ స్వామిదాస్ పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)