నవతెలంగాణ-మద్నూర్
సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంతో పాటు పెద్ద షక్కర్గా గ్రామాల్లో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అంగన్వాడి టీచర్లకు, చిన్నారుల తల్లులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం బిజెపి మండల పార్టీ అధ్యక్షులు తెప్పా తుకారం ఆ పార్టీ కి చెందిన బూత్ అధ్యక్షులు సర్పంచులు వార్డు సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు మేరకు మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని అన్ని అంగన్వాడి సెంటర్ల టీచర్లనున సన్మానించారు. అదేవిధంగా పెద్ద షక్కర్గా గ్రామంలోని రెండు అంగన్వాడి సెంటర్ల టీచర్లకు చిన్నారి పిల్లల తల్లులకు ఆ గ్రామ పెద్దలు రమేష్ దేశాయ్, బూత్ అధ్యక్షులు, సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవా సంకల్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ అంగన్వాడీలను సన్మానించడం బిజెపి నాయకులకు అంగన్వాడీ టీచర్లు చిన్నారి పిల్లల తల్లులు అభినందనలు తెలియజేశారు.







కామెంట్లు (0)