Magazines

ఇది ప్రజాపాలన కాదు.. నిర్భంధ పాలన: ఎమ్మెల్యే వేముల

1 గంట క్రితం

Mla Vemula
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

ఓ సామాన్య టీ స్టాల్‌ నిర్వాహకుడు పొలాస సుధాకర్‌ భీంగల్‌ పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. మృతుడు సుధాకర్‌కు నివాళులర్పించేందుకు హైదరాబాద్‌ నుంచి భీంగల్‌కు బయల్దేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.


భీంగల్ రానివ్వకుండా తనను అడ్డుకున్న పోలీసులను ఉద్దేశించి ఎమ్మెల్యే వేముల మాట్లాడుతూ.. పొలాస సుధాకర్ ఏ రాజకీయ పార్టీకి చెందని వ్యక్తి కాదనీ, ఓ సామాన్య టీ స్టాల్‌ నిర్వాహకుడనీ, తన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహానికి నివాళులర్పించేందుకు మాత్రమే తాను వెళ్తున్నానని స్పష్టం చేశారు. అయినప్పటికీ పోలీసులు తనను ఇంటి వద్దే అడ్డుకోవడం ఏమిటని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. “చనిపోయిన వ్యక్తిని కడసారి చూపు కూడా దక్కకుండా అడ్డుకోవడం ఏం పాలన? ప్రజా పాలన పేరుతో ఇంత నిర్బంధం ఎందుకు? ఒక సాధారణ వ్యక్తి మృతిపై సానుభూతి వ్యక్తం చేయడానికి కూడా ప్రజా ప్రతినిధికి స్వేచ్ఛ లేకపోవడం బాధాకరం” అని వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


పోలాస సుధాకర్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.





ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్