నవతెలంగాణ-మల్హర్ రావు.
జిల్లాలో పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా అందించడమే లక్ష్యంగా భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ కుమార్ శనివారం కాటారం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ పోలీసు స్టేషన్‌లోని రికార్డులు,పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి,సీసీ కెమెరాల పనితీరు, స్టేషన్ పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, కేసులను నాణ్యతతో దర్యాప్తు చేయాలని,ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సూర్యనారాయణ, సిఐ నాగార్జున రావు,సిబ్బంది పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)